అగస్టీన్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- ఆగస్టీన్
జన్మస్థలం:- ఉత్తరాఫ్రికాలోని తగస్టి
తల్లిదండ్రులు:- ఫ్యాట్రికే, మౌనిక
జననం:- క్రీ.శ. 354 వ సంవత్సరం
మరణం:- క్రీ.శ 431 వ సంవత్సరం
రక్షణానుభవం:- 34 సంవత్సరాల వయసులో
సేవా ఫలితము:- ‘ఒప్పుకోలు’, ‘దేవుని పట్టణం’ అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రచించెను. సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకాలు, ప్రసంగాలు ఎంతో తోడ్పడెను..
వ్యక్తిగత సాక్ష్యము:- ఆగస్టీన్ 354 వ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని ప్రగతి అనే స్థలంలో ఫ్యాట్రికే, మౌనిక అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మౌనిక రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆశించి ప్రార్థించేది. అగస్టీన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యనభ్యసించెను. మంచి విద్యావంతుడు. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీక్ భాషలను కూడా నేర్చుకునెను. కానీ ఆ భాషలో ఉన్న కట్టు కథలను అపవిత్రమైన జీవితమునకు అలవాటుపడిన కనుక బైబిల్ ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. ఈయన తల్లి అయిన మౌనిక తన కుమారుని జీవితం మారవలేనని కన్నీటితో ప్రార్థించేది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని అనేక సంవత్సరములు రోత జీవితము జీవించెను. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక పాప జీవితములో కుమిలిపోతూ, రక్షణ మార్గము వెదుకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపము నుండి విడుదల పొందగోరి విఫలుడయ్యెను.
ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడం చూచి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి వద్దకు తీసుకుని వెళ్లగా ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి ఏసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా ఆగస్టీన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్ధించుట మొదలుపెట్టేను. అలాగున ఒకరోజు ప్రార్ధించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అనే ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదవగా మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి క్రీస్తుయేసును ధరించుడి. అన్న వాక్యంపై అతని దృష్టి పడెను. ఆ వాక్యము చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్ధించిన అగస్టీన్ మారుమనసు పొందెను. 388 వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిస్మము పొందెను. 13 సంవత్సరములుగా ఆగస్టీన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టీన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోను, ప్రార్థనలోనూ ఎదుగుచుండెను.. 395 వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకుని బిషప్ గా అభిషేకించబడేను. మంచి ప్రార్థనాపరుడిగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగికుడిగా పేరు పొందెను.
‘ఒప్పుకోలు, దేవుని పట్టణము’ అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాసెను. ఈయన రాసిన పుస్తకాలు సంఘసంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఎంతగానో ఉపయోగపడేను. ప్రారంభ క్రైస్తవ మతంలో సంఘంలో అనగా 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టీన్ గా పిలువబడేను. రక్షణ క్రియల ద్వారా కాదు కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించెను. 431 వ సంవత్సరంలో తన 77వ యేట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణము చేరుకొనెను.
గొప్ప పలుకు:- నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యం లోనికి కొట్టుకొని వచ్చి తిని.