జాన్ నాక్స్ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- జాన్ నాక్స్
జన్మస్థలం:- స్కాట్లాండ్ లోని గీఫోర్డ్ గేట్
భార్య పేరు:- మార్ జోరీ
జననం:- 1513
మరణం:- 1572 నవంబర్ 24
జీవితకాలం:- 59 సంవత్సరాలు
రక్షణానుభవం:- 25 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- రోమన్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించగోరీ, విగ్రహారాధనను ఖండించి ప్రజలను వాక్యానుసారంగా జీవించునట్లు చేసెను..

వ్యక్తిగత సాక్ష్యము:- జాన్ నాక్స్ స్కాట్లాండ్లోని గీఫోర్డ్ గేట్ నందు 1713 వ సంవత్సరంలో జన్మించెను. ఈయన తల్లిదండ్రులు ఇద్దరూ కేథలిక్కులు. వీరు తెలివైన వారు మరియు ధనికులు. జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీకు భాషలు చదివెను. గ్లాస్గోలోని విశ్వవిద్యాలయంలోని ఎనిమిది సంవత్సరములు చదివి యమ్.ఎ. డిగ్రీని సంపాదించెను. అదే కళాశాలలో తత్వశాస్త్రమును బోధించు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత తన 25వ సంవత్సరంలో దేవుని సేవకు యాజకుడుగా నియమించబడ్డారు. ఆ సమయంలో స్కాట్లాండ్ లోని రోమన్ సంఘం ఎంతగా పాడయ్యెనో చూడగలిగాడు. అయితే ఏడు సంవత్సరాలు బైబిల్ ధ్యానించుటలో, ప్రార్ధించుటలో గడిపాడు… ఇతడు సంఘం యొక్క స్థితిని గుర్తించి దానిలోని తప్పులను ఖండించాలని ఆశించెను గాని అట్లు చేసిన యెడల తాను మరణమునకు గురి కాగలనని గ్రహించి ఆ సంఘమును వదిలిపెట్టాడు.. తరువాత జాన్ నాక్స్ ప్రభువు చిత్తము కొరకై ప్రార్ధించుచుండెను. ఆ దినములలో జార్జి అను ఒక ప్రసంగీకుడు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దుష్టత్వమును గూర్చి ఖండించుచుండెను.. జాన్ నాక్స్ అతని యొద్ద చేరి అనేక సువార్త సత్యములను నేర్చుకొనుచుండెను. జాన్ నాక్స్ సేవకునిగా, సహాయకునిగా అతనికి తోడ్పడుచుండెను. అయితే జార్జ్ ని కాల్చి చంపేశారు. జాన్ నాక్స్ ను కూడా పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా అతను ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మారుచు చివరికి జర్మనీ వెళ్లాలని ఆశించాడు.. కానీ స్నేహితులు అక్కడే ఉండమని కోరారు.

 

అయితే ఒక భవనంలో నివాసానికి చేరి అక్కడ కొంత మందికి చదువు చెప్పేవాడు. అయితే తనను వెతుకుతున్నారని తెలిసి అక్కడ ఉండటం మంచిది కాదని తన స్నేహితులతో పాటు సెయింట్ ఆండ్రూ అను స్థలమునకు వెళ్ళాడు. అయితే అక్కడ అనేకులకు దేవుని గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి చెబుతూ స్కాట్లాండ్ యొక్క భక్తిహీనతను తెలియజేసేవాడు. బహిరంగంగా బోధించుటకు భయపడిన జాన్ నాక్స్ 30 సంవత్సరాల వయసులోకి రాగానే ధైర్యంగల ప్రసంగీకునిగా మారిపోయాడు. అయితే ఎప్పుడూ మంచి ప్రసంగాలు చేయుటకు ప్రయత్నించిలేదు కానీ ప్రజలలో ఉన్న దుష్టత్వమును, వారి పాపపు స్థితిని ఖండించి బోధిస్తూ పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గరకు రమ్మని బ్రతిమాలేవాడు. చివరకు స్కాట్లాండ్ దేశపు రాణి కూడా జాన్ నాక్స్ బోధలకు కదిలించబడినను పశ్చాత్తాపపడకా నాక్స్ ను అతని అనుచరులను ఓడ ఎక్కించి ప్రాన్స్ దేశమునకు బహిష్కరించెను. అక్కడ జాన్ నాక్స్ ను సంబంధించి చెరసాలలో వేశారు అయినప్పటికీ ఏ నరునికి భయపడకూడదని తీర్మానించుకున్నాడు. మరియకు మ్రొక్కరాదని, విగ్రహమునకు ఆరాధించుట తప్పని బోధించిన జాన్ నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహమును తెచ్చి ముద్దు పెట్టుకునుమనిరి. కానీ అట్లు చేయుటకు అతడు నిరాకరించి ఆ విగ్రహముము సముద్రంలోనికి నెట్టి వేశాడు. 12 నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది మరల స్కాట్లాండ్ కు వెళ్లటం మంచిది కాదని తెలుసుకొని ఇంగ్లాండుకు వెళ్ళాడు. అచ్చట బహుజనులు కలిగిన ఆంగ్ల సంఘములో ఆతనికి దేవుని వాక్యము అందించు ఆధిక్యత దొరికెను. 1551 వ సంవత్సరమునకు ఆరు సంఘములను చూసుకునేవాడు. తన 40 సంవత్సరాల వయస్సులో ఇతడు మార్ జోరీ అను స్త్రీని వివాహం చేసుకున్నాడు.. తరువాత ఇతడు ‘ఎడ్వర్డ్ – 4’ కోర్టు రాజమందిరంలో ప్రసంగించాడు. అక్కడ రాజైన ఎడ్వర్డ్ ఇతనికి స్నేహితుడై సువార్త పనికి సహకరించాడు. కానీ తన తరువాత రాణిగా వచ్చిన మేరి ట్రాడర్ అను ఆమె జాన్ నాక్స్ ను నిర్లక్ష్యం చేసి అతనిని, అతని స్నేహితులను హింసించటం మొదలుపెట్టింది. ఆ హింసలో అతని స్నేహితులు కూడా కొంతమంది మరణించారు. తరువాత స్కాట్లాండ్ వెళ్ళాడు.తన దేశంలోని ప్రజలలో మార్పును, వాక్యానుసారంగా జీవించుటను చూచి ప్రభువును స్తుతించి, స్వేచ్ఛగా దేవుని వాక్యమును బోధించుట ఆరంభించెను. ఇతను దేవుని ఆత్మ చేత బోధిస్తుండగా రాణి కూడా అడ్డు చెప్పలేకపోయింది. 1560 సంవత్సరంలో జాన్ నాక్స్ భార్య, చిన్న బిడ్డలు కూడా మరణించారు. ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిరుత్సాహపడక తాను చేయవలసిన దేవుని పని చేయుచున్నందుకు సంతోషించెను.. 1570 వ సంవత్సరంలో ఇతడు వ్రాయలేని, నడవలేని స్థితికి చేరిపోయాడు. మరణస్థితికి వచ్చాడు. అయినా దేవుడు తనకు రెండింతల బలమునిచ్చి ప్రసంగించు కృప ఇచ్చెను. 1572 వ సంవత్సరం నవంబర్ నెలలో జబ్బుపడి బలహీనుడయ్యాడు. ఇతడు బలహీనుడై మరణించే రోజు వరకు కూడా తన రెండవ భార్య చేత బైబిల్ చదివించుకొనేవాడు. చివరికి తన 60వ ఏట 1572 నవంబర్ 24వ తేదీ రాత్రి 11 గంటలకు ప్రార్ధించుటకు మోకరించగా జాన్ నాక్స్ శాంతి, సమాధానంతో ప్రభువు సన్నిధికి చేరాడు.

గొప్పపలుకు:- ప్రభువా స్కాట్లాండ్ దేశమును నాకిమ్ము.! లేనియెడల ఆత్మను తీసుకో అని ప్రార్థించేవాడు.

759 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account