శామ్యూల్ రూథర్ ఫోర్డ్ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- శామ్యూల్ రూథర్ ఫోర్డ్
తల్లిదండ్రులు:- విలియం రూథర్ ఫోర్డ్ దంపతులు
జన్మస్థలము:- స్కాట్లాండ్ దేశంలోని ‘నిస్బెట్’ ప్రాంతము
జననం:- క్రీ.శ. 1600 సంవత్సరంలో
మరణము:- క్రీ.శ. 1661 మార్చి 30

సేవాఫలితము:- ఈయన ఒకసంఘానికి కాపరిగా, బైబిల్ కాలేజీలో థియాలజీ ప్రొఫెసర్ గా సేవలందిస్తూ, ‘The Law, The King’ అను గొప్ప పేరుగాంచిన పుస్తకాన్ని రచించాడు.

వ్యక్తిగతసాక్ష్యము:- శామ్యూల్ రూథర్ ఫోర్డ్ క్రీ.శ. 1647 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలోని నిస్బెట్ ప్రాంతంలోని విలియం రూథర్ ఫోర్డ్ దంపతులకు జన్మించాడు. ఇతని యొక్క బాల్య జీవితం గురించి గానీ, తల్లిదండ్రుల గురించి గానీ ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇతని తండ్రి ఒక రైతు అని లేదా ఒక మిల్లులో పనిచేసే వాడిని చెబుతారు. అయితే ఈయన 1627 లో ”ఎడిన్ బర్గ్” కళాశాల నుండి M.A పట్టా పుచ్చుకుని అదే కళాశాలలో ”హ్యుమానిటీ” ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. అంతేకాకుండా యాన్వత్ అనే ప్రాంతంలో ఒకసంఘానికి సంఘకాపరి అయ్యారు. నిజమైనకాపరి హృదయం కలిగిన రూథర్ ఫోర్డ్ నిజాయితీతోను, ప్రేమతోను వారి మధ్య పని చేశారు. సంఘం కొరకు ఎంతో శ్రమించి, కష్టించి, ప్రయాసతో పనిచేశాడు. రూథర్ ఫోర్డ్ గురించి ప్రజలు ఇలా చెప్పేవారు- ”అతడు ఎడతెగక ప్రార్థించేవాడు, సమయము దొరికిన ప్రతిసారీ బోధించేవాడు, చర్చించేవాడు, రోగులను దర్శించేవాడు, పుస్తకాలను వ్రాసేవాడు. అలాగే ఎక్కువగా పుస్తకాలను చదివేవాడు. అతడు తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచేవారు.” యాన్వర్త్ లో అతని ప్రారంభ సంవత్సరాలు కన్నీటితోనూ, దుఃఖముతోను గడిచాయి.

ఎందుకంటే తన భార్య సంవత్సరకాలం నుంచి వ్యాధిగ్రస్తురాలిగా వుండి మరణించింది. అలాగే తన ఇద్దరు బిడ్డలు కూడా మరణించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా గుండె నిబ్బరంతో దేవుని సేవలో కొనసాగినాడు. ఇతడి బోధలు చాలా అసమానమైనవి ఎందుకంటే వాక్యము ద్వారా ప్రజల యొక్క హృదయంలో ఉన్న తప్పులను చూపించి వారిని రక్షణలోనికి, పశ్చాత్తాపంలోనికి నడిపించేవాడు. ఈయన బోధను వినిన ఒక వృద్ధుడు ఇలా అన్నాడు- ”ఇతను వాక్యము ద్వారా నా హృదయం ఏంటో నాకు చూపించాడు” అని చెప్పాడు. 1636 వ సంవత్సరంలో రూథర్ ఫోర్డ్ ”కృపా సిద్ధాంతాలను” సమర్థిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకము ఇంగ్లాండ్ చర్చి సిద్ధాంతాలను పూర్తిగా విభేదిస్తుంది. అవి ఇంగ్లాండ్ చర్చి అనుసరిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను పూర్తిగా విమర్శిస్తున్న ఫలితంగా అతడు సంఘవిద్రోహిగా నేరారోపణ చేయబడి న్యాయస్థానం ముందు నిలువబెట్టబడ్డాడు. న్యాయస్థానము అతడిని దోషిగా పరిగణించింనందున అతడు దేశ బహిష్కరణ గావించబడి ”అబెర్ డీన్” అనే చోటికి ఖైదీగా కొనిపోబడినాడు. అయితే సంఘాన్ని అమితంగా ప్రేమించే ఈయనకు వారికి వేరై ఉండటం అతనికి చేతకాలేదు.

అలా చెరసాల నుంచి సంఘానికి ఉత్తరాలు రాస్తుండేవాడు. ఉత్తరాలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాయి. 1638 లో పార్లమెంటుకును, ఇంగ్లాండ్ రాజుకు మధ్య జరిగిన సంఘటనలు మరియు ఇంగ్లాండ్ చర్చికిని సంస్కరణవాదులకును మధ్య జరిగిన సంఘర్షణలను రూథర్ ఫోర్డ్ కు ఆశీర్వాదకరంగా మారాయి. గలిబిలి మరియు గందరగోళం చోటు చేసుకున్న ఆరోజుల్లో అతడు ”అబెర్ డీన్” చెరసాల నుండి మెల్లగా తప్పించుకొని తనకు అత్యంత ప్రియమైన యాన్వర్త్ కు చేరుకున్నాడు. స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ వ్యవస్థ అతను ఉండాలని తీర్మానించడమే కాకుండా సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో రూథర్ ఫోర్డ్ ను థియాలజీ ప్రొఫెసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలా సేవా పరిచర్యలో కొనసాగుతూ ఇంగ్లాండ్ లో ఉన్న సమయంలో ”THE LAW, THE KING (చట్టము, రాజు)” అనే పేరుతో ప్రసిద్ధి గాంచిన పుస్తకాన్ని రచించాడు. అయితే ఈ పుస్తకము పునరుద్ధరించబడిన తరువాత రచయితగా తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడు. రాజద్రోహిగా నేరారోపణ చేయబడి న్యాయస్థానం ఎదుట నిలబడవలిసిందిగా అతనికి తాఖీదులు పంపించబడ్డాయి. అయితే దానిని తిరస్కరిస్తూ ఇలా జవాబు రాశాడు. ”నేను న్యాయస్థానం ఎదుట నిలిచేందుకు మీరు నిర్ణయించిన తేదీకి ముందే నేను తక్కువమంది రాజులు మరియు ఎక్కువ మంది ప్రజానీకము ఉండే పరలోక న్యాయస్థానం ఎదుట నిలబడబోతున్నాను అని జవాబు పంపించాడు.” తరువాత 1661 మార్చి 30వ తేదీన అతడు మరణించి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు.

377 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account