మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర

పూర్తిపేరు:- మేరీ స్లెస్సర్
తల్లిదండ్రులు:- రాబర్ట్ స్లెస్సర్, మేరీ స్లెస్సర్
జన్మస్థలం:- స్కాట్లాండ్ దేశంలోని ఆవర్ధన్ పట్నం జననం:- 1848 డిసెంబర్ 2
మరణం:- 1915 జనవరి 13
రక్షణానుభవం:- 11 సంవత్సరాల వయసులో
సేవాఫలితం:- ఆఫ్రికా ప్రజల మధ్య సేవ చేసి అనేక మంది మొరటు ప్రజలను మార్చగలిగేను..
గొప్ప పలుకు:- ఈ ఆటవికులు క్రీస్తు శిష్యులు అయ్యారంటే ఇది నా ప్రజ్ఞ కాదు, ఇది ప్రభువు కృపే.

సేవలో ఎదుర్కొన్న కష్టాలు:-

తన 11 సంవత్సరాల వయసులోనే ఒక నూలు మిల్లులో పని చేస్తూ ఒక పూట మాత్రమే చదువుకునేది. స్కాట్లాండ్ దేశంలో యునైటెడ్ చర్చి వారి సహాయంతో 1876 ఆగస్టు 5న ఆఫ్రికా దేశంలోని ”కేలబార్ ” అనే ప్రదేశమునకు ప్రయాణమయ్యెను.. మేరీ ఆఫ్రికా దేశంలోని స్త్రీలను పరామర్శిస్తూ, పిల్లలకు విద్యను అభ్యసింపచేస్తూ వారి కష్టాలు తెలుసుకునేది, వారిపట్ల సానుభూతితో వ్యవహరించేది, వారికి క్రీస్తును గురించి బోధించేది. భయంకరమైన విగ్రహారాధన, నర బలులతో కూడిన పనులు చేసే మూర్ఖులైన ఆ జనులమధ్య, క్రూర జంతువులతో నిండి ఉన్న అడవిలో ప్రభువు కొరకు నిలబడడానికి ఆమె ఎంతగానో ప్రార్ధించి, ప్రభువుపై ఆధారపడి జీవించేది. రెండు సంవత్సరాలు వారి మధ్య నిర్విరామంగా కృషి చేసి అనేకులను ప్రభువు పాదములయొద్దకు నడిపించెను. ఆ తర్వాత ఆమె మరింత భయంకరమైన ”ఓకోయాంగో” అనే ప్రాంతానికి వెళ్లడానికి ఆశించింది. వారి యొద్దకు అంతవరకు ఎవరు వెళ్ళడానికి సాహసించలేదు. వారు బహు క్రూరులు, మూర్ఖులు వారు చేసే అమానుష రాక్షసకృత్యాలు వినడానికి ఎంతో భయంకరంగా ఉండేవి. ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేని నరమాంసభక్షకులు.

అటువంటి వారి మధ్య సేవచేయుటకు 1818 ఆగస్టు 3వ తేదీన యాంకెంగె గ్రామమునకు బయలుదేరెను. మేరీ తను ఎదుర్కొన్న కష్టములను లెక్కచేయక క్రీస్తు వైపు చూస్తూ ఒక పూరి గుడిసెలో నివాసం ఏర్పరచుకొని విశ్వాసముతో, పట్టుదలతో, ప్రార్థనతో పాపులను ప్రేమించి, క్షమించి, రక్షించగల యేసు ప్రభువును గూర్చి చెప్తూ ఉంటే ఆ దుష్టప్రజలు ఆశ్చర్యపోవుచుండిరి. పది సంవత్సరాలలో ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయెను. నరబలులు, దురాచారాలు, త్రాగుడు మొదలగు దురలవాట్లు మానివేసి అనేకులు ఏసుక్రీస్తును సొంతరక్షకునిగా అంగీకరించారు. అనేక పాఠశాలలు, ప్రార్థనా మందిరాలను కట్టించింది. ఆదివారము ఇంచుమించు పది మైళ్లకు పైగా ప్రయాణిస్తూ 12 స్థలములో బోధించేది. ఆమె అనేక బలహీనతలకు, కీళ్ళవాతమునకు గురియాయెను. అయినను ఆమె ప్రదేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకొనక ఒక చక్రాల కుర్చీలో కూర్చుని సేవను కొనసాగించెను.. సమస్త సుఖ సాధనములకు దూరముగా ఉండి ఏకాకిగా 40 సంవత్సరాలు అహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి, ప్రభువు కొరకై తన జీవితమును అర్పించిన మహనీయురాలు. ఈ వీరనారి ఎన్నో అనారోగ్యాలకు గురైనను తన స్వదేశమైనకు అనగా స్కాట్లాండ్ వెళ్లే తలంపే రానివ్వలేదు.. వృద్ధాప్యము వలన కదలలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభువు సేవలోనే ఉండేది. తన చివరి దినములలో పడక మీద మీద ఉన్నప్పటికీని కూడా పరలోకము గురించి ఆలోచిస్తూ ప్రార్థించుచుండెను..

(1పేతురు 3:14) మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి.

ప్రస్తుతదినములలో దేవుని యొక్క సేవ ఒక వ్యాపారముగానూ, డబ్బు సంపాదించేదిగానూ అయిపోయింది.. చాలామంది సేవకులు కూడా సుఖవంతమైన జీవితానికి అలవాటుపడి సేవ చేస్తున్నారు…ప్రభువు కొరకు శ్రమ అనుభవించడానికి బదులు సుఖం కోరుకుంటున్నారు. కానీ మేరీ స్లెస్సర్ తన సేవాజీవితములో ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని కొరకు వాటిని అనుభవించి క్రూరత్వం కలిగిన మనుషులను రక్షణలోనికి నడిపించింది. క్రైస్తవునిగా మనము కూడ దేవునికొరకు శ్రమ అనుభవించుటయు మరియు భయపెట్టే వారికి భయపడకుండా సేవ చేస్తె ఖచ్చింతంగా దేవుడు మనలను హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక..! ఆమెన్..!

961 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account