విలియం కేరి సేవాజీవితము
పూర్తిపేరు:- విలియం కేరి
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని నార్త్ యాంస్టన్ షైర్ సమీపంలో గల ‘పాలెర్సు పురి’ అనే గ్రామం
తల్లిదండ్రులు:- ఎడ్మండ్, ఎలిజబెత్
జననం:- 1761 ఆగస్టు 17
మరణం:- జూన్ 1834
రక్షణానుభవం:- 18 సంవత్సరాల వయసులో
సేవా ఫలితము:- భారతదేశంలోని అనేక భాషలలో బైబిలును తర్జుమా చేసెను. మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ ను ఏర్పాటు చేసి బైబిల్ మొదటిగా ప్రింట్ చేయించెను.
సేవలో ఎదుర్కొన్న కష్టాలు:-
1779 వ సంవత్సరంలో మిషనరీగా తన జీవితాన్నీ సేవకు సమర్పించుకున్నాడు.. ఓడ ద్వారా ప్రయాణమై 1793 నవంబర్ 11న భారతదేశంలోని కలకత్తా చేరుకున్నాడు..మిషనరీగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. ప్రింటింగ్ కు సిద్ధంగా ఉన్న బైబిల్ ప్రతులన్ని కాలిపోయినప్పటికీ నిరుత్సాహ పడక తిరిగి వాటిని మరలా తర్జుమా చేసి ప్రింట్ చేసాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కేరీకి వ్యతిరేకంగా పనిచేశారు. కుటుంబ సభ్యులు క్రైస్తవ సంస్థలు కూడా సహకరించలేదు. మొదటి ఏడు సంవత్సరాల సువార్త ప్రయాణంలో ఒక్కరు కూడా రక్షించబడలేదు. 41 సంవత్సరాలు భారతదేశంలో మిషనరీగా పని చేసి ఇంచుమించు 24 భాషలలో పూర్తి బైబిల్ ను, 40 భాషలలో క్రొత్త నిబంధనను తర్జుమా చేసి ప్రింట్ చేయించినాడు. ఈ యాత్రలో తన కుమారుడు మరణించాడు, తన భార్య మరణించింది, తన ముఖ్య స్నేహితులు మరణించారు.. అలాగే తన కాలును పోగొట్టుకున్నప్పటికీ సేవను మాత్రం ఆపలేదు…
గొప్పపలుకు:- “దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు” అంటూ ముందుకు కొనసాగినవాడు విలియం కేరి.
కీర్తనలు 60:12:- దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈ వాక్యములో మనకు తెలియజేసిన విధంగా విలియం కేరీ దేవుని కొరకు గొప్పకార్యములు చేసాడు మరి ఆ దేవుని కొరకు, ఆత్మలరక్షణ కొరకు మనము కూడా అంతటి త్యాగము చెసెవారిగా వుండాలి..అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.. ఆమెన్..