జాన్ పేటన్ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- జాన్ గిబ్సన్ పేటన్
జన్మస్థలం:- స్కాట్లాండ్
తల్లిదండ్రులు:- జేమ్స్ పేటన్, జానెట‌్ పేటన్
భార్య పేరు:- ఇంగ్లేష్
జననం:- 1824-మే-24
మరణం:- 1907-జనవరి-28

రక్షణానుభవం:- 12 సంవత్సరాల వయసులో

సేవా ఫలితం:- న్యూ హై బ్రిడిస్ దీవులలో నరమాంసభక్షకుల మధ్యలో సేవ చేసి వారిని ప్రభువు కొరకు సంపాదించెను…

వ్యక్తిగత సాక్ష్యం:- జాన్ పేటన్ స్కాట్లాండ్ లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824 వ సంవత్సరం మే 24 న జన్మించాడు. ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్ధనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూసిన జాన్ పేటన్ చిన్న వయసులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. 12 సంవత్సరాల్లోనే గ్రీకు, లాటిన్ భాషలను అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారంలో తోడ్పడేవాడు..తర్వాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యలు కూడా అభ్యసించాడు. పేద వారి మధ్య సేవ చేస్తూ త్రాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికులుగా ఉన్నవారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను యేసు వైపు తిప్పేవాడు. అంతేకాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తును ఎరుగకయే మరణిస్తున్నారని తెలుసుకొని పేటన్ వారి మధ్యకు మిషనరీ వెళ్లి సేవ చేయాలనే ఆశ కలిగి ఉండేవాడు. దానికొరకు ప్రార్థన చేసేవాడు.

న్యూ హైబ్రిడిస్ దీవులలో మిషనరీ అవసరతను గుర్తించాడు. దేవుని పిలుపు విని నరమాంసభక్షకులు జీవించే ఆ దీవులకు వెళ్ళుటకు సిద్ధపడేను. కొందరు నీవు వారి మధ్యకు వెళితే వారు చంపుకొని తినేస్తారు అని భయపెట్టారు. అయితే పేటన్ ధైర్యంగా- ఎలాగూ నేను చనిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు, కాబట్టి క్రీస్తు కొరకు జీవించినప్పుడు నన్ను నరమాంసభక్షకులు తినిన చింత ఎందుకు అనేవాడు..నేను బ్రతికున్న, చనిపోయినా క్రీస్తు కొరకే అంటూ తన 33వ యేట అనగా 1857 వ సంవత్సరంలో తన భార్యతో పాటు సేవకు వెళ్లెను.. టానా అనే ద్వీపంలో ప్రవేశించెను. ఆ దీవిలో అనేక తెగల ప్రజలు జీవించేవారు. ఒక తెగతో మరొక తెగవారు పోరాడుతూ, జయించినవారు మరణించినవారి శరీరాలను భక్షించేవారు…వారి క్రూరత్వాన్ని, మూఢత్వాన్ని చూసిన పేటన్ కన్నీటితో వారి కొరకు ప్రార్థిస్తూ, ధైర్యంగా అటువంటి నరమాంస భక్షకులు మధ్య ముందుకు సాగెను.

వారు బహు మూఢాచారాలు కలిగిన జనులు.. మంత్రములు, తంత్రములు నమ్ముతూ బలులు అర్పించుచూ ఉండేవారు. అచట వాతావరణం బహు కలుషితమైనందున తన భార్య, చిన్న బిడ్డ అనారోగ్యం పాలయ్యారు. ఆ జనులమధ్య బహు సహనముతో క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారి భాష రాకపోవడం వల్ల సంజ్ఞల ద్వారా యేసు ప్రభువును గూర్చి చెప్పడం చేసేవాడు.. తరువాత వారి భాష నేర్చుకొనుచుండెను.. అనేకసార్లు అతనిని చంపడానికి వచ్చిన నరమాంసభక్షకుల బారినుండి ప్రభువే తప్పించెను. ఆ తరువాత దగ్గరగానున్న ”అనీవా” ద్వీపమునకు కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహు సహనముతో ప్రయాసపడెను. ఆ అనాగరికులకు నీరు ఆకాశము నుండి కురుస్తుందని మాత్రమే తెలుసు. ఒకప్పుడు నీటికి కొరత కలుగగా పేటన్ ఒక బావిని త్రవ్వటం ప్రారంభించాడు.. ఆయన చేస్తున్నది ఎవరికీ అర్థము కానందున భయపడి వారెవరు బావి దగ్గరకు రాకపోగా ఇంచుమించు కొన్ని గంట‌లు ఆయన ఒక్కడే త్రవ్వి ఆ బావి నీటిని వారికి అందించెను.. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపడి తన దేవుడు నిజమైన దేవుడని అనుచూ క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరి.. అనీవా ప్రజలు బహు అనాగరికులు సరైన దుస్తులు ఉండేవికావు వారు పాముని ఆరాధించేవారు…వారు చిన్న బిడ్డలను బలి ఇచ్చేవారు, అయితే పేట‌న్ ప్రయాస ప్రార్థనల వలన వీరు ఆ కార్యములను విడిచి బయటపడిరి..

అనీవా ద్వీపము నందు ”నమాకై” అను నాయకుడు మొదట ప్రభువును అంగీకరించెను. తద్వారా అనేకులు మారిరి. చివరికి కన్నీటి ప్రార్ధనతో, పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్య వలన న్యూ హైబ్రిడిస్ దీవులలోని ఏడు మైళ్ళ పొడవు, రెండు మైళ్ళ వెడల్పున్న అనీవా ద్వీపవాసులంతా ప్రభువు అంగీకరించిరి…
అనారోగ్యంతో అతని భార్య బిడ్డ చనిపోయారు.. జ్వరంతో పేట‌న్ బాధపడుతున్నను తానే స్వయంగా తన చేతులతో తన భార్య, బిడ్డను పాతి పెట్టవలసి వచ్చెను..1899లో పేటన్ అనీవా భాషలో నూతన నిబంధనను సిద్ధపరచెను..80 సంవత్సరాల వయసులో విశ్రాంతి తీసుకోమని వైద్యులు ఎంత చెప్పినా లెక్కచేయక ఉత్తరాలు వ్రాయటంలోనూ, కాలినడకన గృహములు సందర్శించి ప్రార్థించుటలోనూ, అర్ధరాత్రి వరకు లేఖలు వ్రాయుచూ బైబిల్ ను తర్జుమా చేయుటలో గడిపెను…ప్రతి రోజు ఏదో ఒక పనిని దేవుని కొరకు చేయనిదే కొంచెం విశ్రాంతి తీసుకొనుటకు కూడా ఇష్టపడేవారు కాదు..అలాగే నా చివరి శ్వాస వరకు సేవలో కొనసాగుతానని ప్రపంచంలోనే పలు ప్రాంతాలు సంచరించి ప్రభు అప్పగించిన గొప్ప సేవ చేసాడు.. జనవరి 28 1907 అనగా 183 వ యేట ప్రభు సన్నిధికి చేరెను…

గొప్ప పలుకు:- ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు.. ఆయన సాన్నిధ్యము నాతో లేని ఎడల నాకు మతి చలించి యుండును…

707 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account