సాదు సుందర్ సింగ్ జీవిత చరిత్ర

పూర్తిపేరు:- సాదు సుందర్ సింగ్
జన్మస్థలం:- భారతదేశంలోని ”రాంపూర్” అనే గ్రామం
తల్లిదండ్రులు:- సర్దార్ షేర్ సింగ్ దంపతులు
జననము:- 1889 సెప్టెంబర్ 3
మరణం:- 1929లో
రక్షణానుభవం:- 16 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- రక్తం కారుతున్న పాదములతో అనేకులకు ముఖ్యముగా టిబెట్ ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించెను…

బాల్యము:- సాధు సుందర్ సింగ్ 1889వ సంవత్సరం సెప్టెంబర్ 3న పంజాబ్ లోని రాంపూర్ అనే గ్రామంలో మత వైరాగ్యంతో నిండిన సిక్కు కులమునందు పుట్టెను. ఆయన తండ్రి పాటియాలా సంస్థానమందున్న రాంపురం అనే పట్టణమందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేర్ సింగ్ ధనవంతుడైన భూస్వామి.. సుందరుడు ఏడేండ్ల వాడైనప్పుడు సంస్కృతములో భగవద్గీతను వల్లించెను.. క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యంతో నిండి ఉండెను. మతాభిమానంచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలులకు నాయకుడాయెను. క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్ కు ఇచ్చిన బైబిల్ గ్రంధాన్ని అతడు చించి కాల్చి వేసెను. అయితే బైబిల్ కాల్చిన దినము నుండి అతని హృదయములో గొప్ప కలవరము కలిగెను…

సేవా జీవితము:- ఒకరోజు తనకు తెలిసిన దేవుళ్ళందరి పేరట ప్రార్ధించుట మొదలుపెట్టాడు తనకు ఏ దేవుడు కనిపించకపోగా, తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిపోయిన సుందర్ సింగర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకో‌దలచెను.. కానీ చివరగా దేవుడంటూ ఒక్కడుంటే కనిపించమని ప్రార్థన చేసెను.. అప్పుడు ఆ గది ప్రకాశమానమైన వెలుగుతో నిండెను.. ప్రభువైన యేసు యొక్క మహిమ గల ముఖము కనిపించెను.. మేకులతో గాయపడిన ఆ హస్తములను చూపి ”ప్రియుడా నీ కొరకు నా ప్రాణము పెట్టితిని, నన్ను ఎందుకు హింసించుచున్నావు.? అన్న ప్రభువు మాటలు వినెను. . ఆ క్షణం నుంచే ఆయన హృదయంలో మెరుపువలే వెలుగు పుట్టెను.. అతని తల్లిదండ్రులకు తన భావాలను తెలియపరిచినప్పుడు అతని తండ్రి సుందర్ నీరు మూడు రోజుల క్రితమే గదా బైబిల్ కాల్చితివి…మరి ఇప్పుడు నీవు చేయునది ఏమనగా, సుందర్ – నేను ప్రభువగు యేసును చూసితిని అని చెప్పెను.. కోపించిన తండ్రి అతనిని ఇంటి నుండి పంపివేశారు….

ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడు ఎక్కడ ఉన్నను ఫలానా వారి కుమారుడు అని అనిపించుకునే వారి కులానికి సిగ్గు తెచ్చును అనుకొని అతనిని పిలిపించి ఆహారంలో విషం కలిపి ఇచ్చెను .. ఫాదర్ గారి ఇంటికి వెళ్లే మార్గంలో స్పృహ తప్పి పడిపోయెను.. ఫాదర్ గారు అతనిని తన గృహములోనికి చేర్చుకొని ప్రార్ధన చేయగా, ఆ విషము విరిగిపోయెను. సుందర్ తన 16వ ఏట బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందినాడు.. ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ క్రీస్తును వెంబడించుటలో వెనుదీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగుతూ క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుచుండెను …అతని బంధువులు అతనిని డబ్బుతో, ఆస్తితో ఆకర్షించే ప్రయత్నము చేసిరి.. ఎన్నోసార్లు చంపే ప్రయత్నం చేసిరి. అయిననూ ”క్రీస్తు తప్ప నాకు ఈ లోకం లోనిది ఏదియు అక్కరలేదు” అని ముందుకు సాగిపోయెను ..థామస్ కెంపస్ రాసిన ‘క్రీస్తు అనుకరణ’ అను పుస్తక పఠనము సుందర్ సింగ్ ను ఎంతగానో ప్రభావితము చేసినది. క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తుడు కావాలనే వాంఛతో పరిశుద్ధపరచబడిన జీవితం కొరకు ఉపవాస ప్రార్థనలు చేసెను..

సువార్త ప్రకటన నిషేధించబడిన నేపాల్ లో సుందర్ సింగ్ ను సువార్త ప్రకటిస్తున్నాడు అనే నేరంతో పట్టుకొని జైలులో వేసిరి .. అక్కడ తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తూ ఉన్నందున అతని కాళ్లు, చేతులు కట్టి జలగలను శరీరంపై వేశారు.. జలగలు రక్తం పిలుస్తున్న బాధలో కూడా ప్రార్థిస్తూ, పాటలు పాడుతున్న సుందర్ సింగ్ ను పిచ్చివాడు అనుకొని జైలు నుండి పంపివేశారు …శ్రమలలో ఆనందించే నీ భక్తి రహస్యం ఏమిటని అడిగితే ‘నా శ్రమలలో బాధలలో క్రీస్తు సిలువే నాకు ఆదరణ కలుగజేసి నిరీక్షణ ఇస్తున్నది’ నా కొరకు నా యేసుప్రభు పరలోక మహిమను వదిలి శిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలు సంపాదించుకొనుటకై నేను నా సిలువను మోయుటలో గొప్పతనం ఏమీ లేదని చెప్పేవాడు..కాషాయి అంగీ, తలకు పాగా, గడ్డంతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు, ప్రేమ, కనికరం ప్రజ్వలించుచుండేవి.. అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండిరి. అనేక పట్టణములు, దేశములు ప్రయాణము చేసి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించెను ..ఈయన ప్రసంగాలు బహు సులభ శైలిలో, ప్రతివారు గ్రహించగలుగునట్లు ఉపవాసములతో, సువార్త సత్యములతో నిండి ఉండేది.. సుందర్ సింగ్ యొక్క పరిచర్య భారతదేశపు ఎల్లలు దాటింది.. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వరకూ ఆయన సువార్తను బోధించెను…

వ్యక్తిగత సమస్యలు:- సుందర్ సింగ్ ఒక బైబిల్ ను, ఒక దుప్పటిని మాత్రమే వెంటబెట్టుకొని ”యేసుతో వెళ్లాలని తీర్మానించితిని” అని పాడుతూ ముందుకు సాగిపోయారు.. హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, టిబెట్ లో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించెను.. సువార్త సేవ లో ఎన్నో కష్టాలు, బెదిరింపులు, శ్రమలు అనేకసార్లు ప్రాణాపాయములు కలిగినా యేసువైపు చూచుచు ముందుకే సాగెను.. ఒకసారి నీరు లేని ఒక పాడుపడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభువు మరణము నుండి అతనిని ఆశ్చర్యముగా తప్పించెను. గర్వం ఎప్పుడూ ఉండేది కాదు,
1919 లో బర్మా, మలయా, సింగపూర్, చైనా ల మీదుగా జపాన్ వెళ్ళాడు, అక్కడ ప్రసంగించాడు. 1919 నాటికి 12 సార్లు టిబేట్ వెళ్లి వచ్చాడు. 1920లో ఇంగ్లాండులో కొంతకాలం సంచరించి తరువాత అమెరికా వెళ్లాడు..చివరిసారిగా 1929 నాటికి భారతదేశానికి వచ్చి ఎనలేని సేవ చేశాడు అదే సంవత్సరంలో టిబెట్ ప్రాంతానికి మరోసారి సువార్త ప్రకటించడానికి వెళ్లిన సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదు…..

గొప్ప పలుకు:- ”క్రీస్తును లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయము”

3075 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account