బిల్లీ సండే జీవిత చరిత్ర

పూర్తిపేరు:- బిల్లీ సండే (విలియం అస్లీ సండే)
తల్లిదండ్రులు:- విలియం సండే మేరీ జాన్ సండే
జన్మస్థలము:- అమెరికా దేశంలోని, స్టోరీ కంట్రీలో జన్మించాడు
జననము:- 1862 నవంబర్ 19
భార్యపేరు:- హెలెన్ థామ్సన్ సండే
రక్షణానుభవం:- 31 సంవత్సరాల వయసులో మరణం:- 1935 నవంబర్ 6

సేవాఫలితం:- బేస్ బాల్ ఆటలో నైపుణ్యం సాధించిన బిల్లీ సండే తన ఆటను విడిచిపెట్టి క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని 300 ఉజ్జీవకూడికలు నిర్వహించి, ఒక మిలియన్ మందిని ప్రభువు చెంతకు నడిపించాడు.

వ్యక్తిగతసాక్ష్యం:- బిల్లీ సండే అమెరికా దేశంలోని స్టోరీ కంట్రీలో 19 నవంబర్ 1862 లో జన్మించాడు. ఇతని తండ్రి ప్రమాదవశాత్తు చిన్న వయసులోనే మరణించాడు. తల్లి గురువుగా ఉంటూ క్రమశిక్షణలో పెంచింది. యేసయ్య గురించి ప్రతిదినము బోధించేది. ఆర్థిక స్తోమత వల్ల బిడ్డలను అనాధ ఆశ్రమంలో చేర్చింది. అక్కడ కూడా క్రైస్తవ వాతావరణమే కానీ చదువు సరిగ్గా అబ్బలేదు. పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి బ్రతుకుదెరువు కోసం ఏదో ఒక పని చేయక తప్పలేదు. జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం దేనికొరకు అయినా ఇతరుల మీద ఆధారపడకుండా కష్టపడి సంపాదించుకోవాలి అని నేర్చుకున్నాడు. కాబట్టి చదువులో పట్టు సాధించాడు, మంచి ఉద్యోగంలో చేరాడు. మిత్రుల సలహా మేరకు పరుగుపందెంలో పాల్గొని మొదటి వాడిగా వచ్చాడు అంటే యావత్ అమెరికా దేశంలోనే 100 గజాల పరుగుపందెం 10 సెకన్లలో ముగించిన వారిలో ఒకడయ్యాడు. క్రీడా లోకంలో మంచి పేరు తెచ్చుకొని బేస్ బాల్ ఆటను జీవనోపాధిగా ఎన్నుకున్నాడు.

ఒకరోజు అతని జట్టులో ఐదుగురు స్నేహితులు వీధిలో కలిసిపోయి కూర్చున్నారు. క్రైస్తవ గుంపు ఒకటి పాటలు పాడుతూ వస్తున్నారు ఆ కీర్తనలు వింటే బిల్లీకి తన తల్లి తెల్లవారుజామున పాడే పాటలు గుర్తుకు వచ్చినవి. ఆ గుంపులో ఒకరు రమ్మని ఆహ్వానించినప్పుడు వారితో వెళ్తూ, క్రీస్తు పాదాల చెంతకు వెళ్తున్నాను అని తన స్నేహితులకు చెప్పినప్పుడు వారు హేళన చేశారు. అలా బేస్ బాల్ జట్టులో చేరిన ఆరు సంవత్సరాలకు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. తర్వాత ఇక ఆలస్యం చేయకుండా చికాగోలోని ప్రెస్బిటేరియన్ లో చేరాడు. కొన్నాళ్లకు స్థానికంగా ఉన్న వై.ఎం.సి.ఎ లో చేరి అక్కడ ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత తన ఉద్యోగము కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనిని ప్రక్షాళన చేసేవాడు. అయితే తన ప్రార్థనా ఫలితంగా ఒకచోట ప్రసంగించమని టెలిగ్రామ్ వచ్చింది. దానితో అతని పరిచర్యకు బీజం ఏర్పడింది. ఆ పట్టణంలో 84 ప్రార్ధన గుంపులను ఏర్పరిచి అనేక స్థలాల్లో ఆరాధనలు జరిగించి తను చేసిన బోధనల ఫలితంగా మూడు లక్షల మంది విశ్వాసులు అయ్యారు. తన ప్రసంగాలు ఎలా ఉండేవి అంటే వినే వారికి ఇదే చివరి అవకాశం అన్నట్లుగా ఉండేవి. బోధ వినేవారు మరణించే ముందు ఖచ్చితంగా క్రీస్తును అంగీకరించడానికి ఇదే చివరి అవకాశం అని భావించేవారు అలా బోధించేవాడు. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి బోధించేవాడు కాదు. తన బోధను విని దేవుని రక్షణ మార్గం ఏమిటో తెలుసుకోవడానికి వేదిక దగ్గరకు వచ్చి తనకు చేయి అందించి వారితో చెయ్యి కలపటం బిల్లీకి అలవాటు (ఇప్పుడున్న సేవకులకు ఇది అలవాటు ఉండదు).

బిల్లీ సండేను గమనిస్తున్న ఒక విలేఖరి ఈయన నిమిషానికి 57 మందితో చేయి కలుపుతున్నట్లుగా అంచనా వేశాడు. అందరినీ సమానదృష్టితో చూసేవాడు. దేవుని వాక్యానుసారముగా ఏ వ్యక్తి అయినా క్రీస్తును ఆపేక్షించినప్పుడు దారి తప్పిపోతాడు, క్రీస్తును రక్షకునిగా స్వీకరించినవారే పరదైసులో తమ స్థానం సుస్థిరం చేసుకుంటారు అని నొక్కి చెప్పేవాడు. తరచూ ఈ ఉపమానము ఉపయోగించేవాడు దక్షిణాఫ్రికా భూమిలో వజ్రాలు ఉన్నాయి కానీ అక్కడకు వెళ్లి ఆ గనులు తవ్విన వారికె అవి లభ్యమౌతాయి. బైబిల్ కూడా అంతే ఆత్మ సంబంధమైన సత్యాలను తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి అని ప్రోత్సహించేవాడు. అదేవిధంగా ప్రార్థనలో కూడా ఎక్కువ సమయం గడిపేవాడు. అలా దేశములోని ఒక అంచు నుండి మరొక అంచు వరకు నిర్విరామంగా సంచరిస్తూ తనకున్న శక్తినంతా క్రీస్తు సువార్తను ప్రసంగించేందుకు వినియోగించేవాడు. ఆ విధంగా మిలియన్ జననాంగాన్ని ప్రభువు చెంతకు నడిపించి 1935 నవంబర్ 6వ తేదీన ప్రభు సన్నిధికి చేరుకున్నాడు.

గొప్పపలుకు:- డబ్బు లేని తోటి వాడు పేదవాడు డబ్బు తప్ప మరి ఏమీ లేని వాడు ఇంకా పేదవాడు.

1610 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account