ఫ్లారెన్స్ నైటింగేల్ జీవితచరిత్ర

పూర్తిపేరు:- ఫ్లారెన్స్ నైటింగేల్
తల్లిదండ్రులు:- విలియం నైటింగేల్, ఫ్రాన్సిస్ నైటింగేల్
జన్మస్థలము:- ఇటలీ దేశం
జననం:- 1820 మే 12
రక్షణానుభవం:- 16 సంవత్సరాల వయసులో మరణము:- 1910 ఆగస్టు 13
సేవాఫలితము:- ఇంగ్లాండ్ దేశంలోని ఆసుపత్రుల అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి అని నిర్ణయించుకొని వారికి అవసరమైన మందులు, వస్తువులు, బట్టలు, చందాలు పోగుచేసి వైద్యసదుపాయం కల్పించింది. అలాగే నర్సులకు తర్ఫీదునిచ్చే పాఠశాలను ప్రారంభించింది.

వ్యక్తిగతసాక్ష్యము:- ఫ్లారెన్స్ నైటింగేల్ ఇటలీ దేశంలో 1820 మే 12 వ సంవత్సరమున జన్మించింది. చిన్ననాటి నుండి చాలా చక్కటి అమ్మాయి, నెమ్మది పరురాలు. బయట ఆడటంకంటే పాఠాలు నేర్చుకోవడానికి, మంచి విషయాలపై ఆలోచించడానికి ఇష్టపడేది. తను దేవునిలో చాలా మంచిగా ఉండేది, లోబడి నడుచుకునేది. ప్రార్ధనలో ఎక్కువ సమయం గడిపేది. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయటం ఆమెకు చాలా ఇష్టం. తన ఇంటి ముందే అనేక మంది పేదలు, ఆకలితో మాడుతున్న ప్రజలు ఉండటము ఆమె గమనించి ప్రతిరోజు ఒక చేతి బుట్టనిండా వారి కొరకు బట్టలు, దుప్పట్లు, మందులు, ఆహారం తీసుకుని వారికి ఇస్తూ ఉండేది. పేదలకు, రోగులకు సేవచేయడానికి దేవుడు తనను పిలుస్తున్నాడు అని గ్రహించింది. అదే విధంగా ఇంగ్లాండ్ దేశంలో ఆసుపత్రులయొక్క సదుపాయములు సరిగా లేవని వాటి అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి అని నిర్ణయించుకుంది. కాబట్టి నర్సుగా తర్ఫీదు పొందటానికి జర్మనీ వెళ్ళింది.

ఆసమయంలోనే సమీపంలో ఉన్న మురికివాడలో కలరా వ్యాధి వ్యాపించింది.. తన ఆరోగ్యానికి ఏ మాత్రము భయపడకుండా వెళ్లి వారిలో రోగులైన వారికి సేవ చేసింది. తరువాత క్రిమియా అనే ప్రాంతంలో యుద్ధం జరిగి 30 వేల మంది సైనికులు చనిపోవడం వలన సైనికులే నర్సుల పని చేస్తున్నారని తెలుసుకుని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి రాత్రింబవళ్ళు అవసరమైన వస్తువులను కొనడం, మందులు, బట్టలు, చందాలు మొదలైనవాటిని పోగుచేసి వారికి సేవ చేయుటలో నిమగ్నమైంది. తద్వారా తన పేరు ఇంగ్లాండ్ దేశమంతా మారుమ్రోగింది. నిద్రపోవడానికి సమయము లేనంతగా యుద్ధస్థలానికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మంచి తర్ఫీదు పొందిన 38 మంది నర్సులతో యుద్ధఆస్పత్రికి బయలుదేరింది. ఆ సైనికులకు పరిచర్య చేసి ఆదరించే వారు లేక భయంకరమైన చలికి గురై వారిలో అనేకమంది మరణిస్తున్నారు. వెంటనే రోగులకు అవసరమైన వాటిని చేకూర్చింది. ఆమె ప్రతి దానిలో మార్పు చేకూర్చింది. ఆమె ప్రతి దానిలో మార్పులు తీసుకు వచ్చిందని రోగులు, డాక్టర్లు గుర్తించారు. వేడి వేడిగా ఉన్న మంచి ఆహారాన్ని రోగులకు అందుబాటులో ఉండేలా చేసింది. ప్రతి రాత్రి చేతిలో దీపం పెట్టుకుని ప్రతి రోగిని దర్శించేది. బాధలో ఉన్నవారిని ఆదరించి ధైర్యపరిచేది. పనిచేసి అవసరంలో ఉన్నవారిని గుర్తించి వారికి వైద్యసదుపాయాలు కలిగించేది. గాయపడిన సైనికుల పక్కన కూర్చుని ప్రార్థించేది. అందరూ ఆమెను ‘లేడీ విత్ ఎ ల్యాంప్’ అని పిలిచేవారు. ఫ్లారెన్స్ 2 లేక 3 గంటల సేపు మాత్రమే నిద్రపోయేది. తిరిగి పెందలకడ లేచి తన పనిని ప్రారంభించేది. బాలాక్లావాలోని యుద్ధం జరిగే స్థలాన్ని ఫ్లారెన్స్ సందర్శించింది. అక్కడి సైనికుల్లో చాలామంది ఫ్లారెన్స్ ను గుర్తుపట్టారు. అంతా ఆమె చుట్టూ గుమికూడారు. వారు ఎంతగానో ఆమెను ప్రేమించారు.

అదే విధంగా ఇంగ్లాండ్ ప్రజలు ఆమె ఎడల తమకున్న కృతజ్ఞతను వ్యక్తపరచుకోవడానికి 45000 పౌండ్లు పోగుచేసి ఇచ్చారు. ఆ డబ్బును ఆమె నర్సింగ్ స్కూల్ స్థాపించడానికి ఉపయోగించింది. నైటింగేల్ ఖ్యాతి ఈ ప్రపంచం అంతా పాకింది. గృహపరిచర్య అనే పుస్తకాన్ని ఆమె వ్రాసింది. ఆమె ప్రార్థించి దైవనడిపింపుతో నర్సులకు తర్ఫీదునిచ్చె మరో రకమైన పాఠశాలను స్థాపించింది. చిన్నచిన్న వ్యాధుల నివారణ విధానాన్ని కూడా ఈ నర్సులు పల్లె ప్రజలకు నేర్పించాలి. చివరి వరకు దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేర్చి 1910 ఆగస్టు 13 న తాను ప్రేమించిన ప్రభువుకు తన ప్రాణమును అప్పగించింది..

337 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account