కృపా కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా ||2||
నా శ్రమ దినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప ||2||
కృపా సాగరా మహోన్నతమైన
నీ కృప చాలునయా
||కృపా||
చరణం-1:
శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోనీ ||2||
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే ||2||
నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే
||కృపా||
చరణం-2:
గాలి తుఫానుల అలజడిలో
గూడు చెదరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి ||2||
నీ వాత్సల్యమే నవ వసంతము
నా జీవితదినముల ఆద్యంతము ||2||
ఒక క్షణమైన విడువని ప్రేమామృతము
||కృపా||
చరణం-3:
అత్యున్నతమైన కృపలతో
ఆత్మఫలముల సంపదతో
అతిశ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది
నీ ప్రేమరాజ్యములో హర్షించు వేళ ||2||
నా హృదయార్పణ నిను మురిపించనీ
నీ గుణాతిశయములను కీర్తించనీ ||2||
ఈ నిరీక్షణ నాలో నెరవేరనీ
||కృపా||
Hello
Hai