ముంగండ శాంతారావు జీవిత చరిత్ర

పూర్తిపేరు:- ముంగండ శాంతారావు
జన్మస్థలము:- తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం తాలూకా, తుమ్మలపల్లి గ్రామం
తల్లిదండ్రులు:- ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులు”
“జననము:- “1956 అయి ఉండొచ్చు
రక్షణానుభవము:- 7 సంవత్సరాల వయసులో
పొందుకున్న దైవదర్శనం:- ఆకాశంలో దేవదూతలు దేవుని వాక్యములు రాయటం చూశాడు.

వ్యక్తిగతసాక్ష్యం:-
ముంగండ శాంతారావు గారు తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం తాలూకా, తుమ్మలపల్లి గ్రామంలోని C.S.I సంఘ సభ్యులైన ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులకు 1956వ సంవత్సరంలో 5వ సంతానంగా జన్మించారు. వీరు మొత్తం ఏడుగురు సంతానం. ఈయన చిన్ననాటి నుండి సండేస్కూల్ కు వెళుతూ దేవుని గురించి తెలుసుకుని ఏడు సంవత్సరాల వయసులోనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అయితే ఒకరోజు ఈయన దైవదర్శనం చూశారు. ఆకాశంలో దేవదూతలు దేవుని వాక్యములు రాయటాన్ని దర్శన రూపములో చూశారు… 1972 లో పదవతరగతి చదువుతున్నప్పుడు తన తరగతి గదిలో దేవుని వెలుగును కూడా చూశాడు. 1975లో మన్నా బైబిల్ ఇనిస్టిట్యూట్ లో బైబిల్ ట్రైనింగ్ పొందుతున్న సమయంలో పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్రలో జరిగిన సంఘటన ద్వారా సువార్తను గ్రహించి ఆయన జీవితము ద్వారా దేవుని యొక్క సేవ చేయాలని స్ఫూర్తి పొందాడు. ఆ విధంగా శాంతారావు గారు సేవకు సమర్పించుకుని తాను పొందిన దర్శనము ప్రకారము అందరూ దేవుని వాక్యము చదివి క్రీస్తును గుర్తించేటట్లుగా గోడల మీద, స్తంభాల మీద దేవుని వాక్యాలు రాయాలని తీర్మానించుకున్నాడు. మొదటిగా తాను ఉన్న ఊరిలో, బంధువుల ఊరిలో, ఎక్కడికి వెళ్ళినా రంగు డబ్బాలు కొనుక్కుని గోడల మీద, స్తంభాల మీద దేవుని వాక్యాలు రాయటం మొదలు పెట్టాడు. 1978లో బైబిల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మచిలీపట్నం వెళ్లి “ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ ఇండియా” వారి సంస్థలో సేవకునిగా చేరాడు. అతనిని దివిసీమ అనే పట్టణంలో నాగాయలంక అనే గ్రామంలో అతన్ని సేవకునిగా, సంఘ కాపరిగా వేశారు. దివిసీమ అంటే అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ప్రాంతాలను కలిపి దివిసీమ అంటారు. ఈ ప్రాంతాలను ఆధారం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ, ప్రతి గ్రామంలో వాక్యాలు రాయడం పూర్తిచేశాడు. ఆ విధంగా మొత్తం రాష్ట్రమంతా తిరగాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే భోజనము, నివాసము గురించి తాను ఆలోచించలేదు. కేవలము దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగారు. అలా దేవుని వాక్యము రాస్తూ పలు ప్రాంతాలు తిరిగి కనీసం పడుకోవటానికి నివాసం లేక ఒక ఊరిలో ఒక పాస్టర్ గారిని ఒక రాత్రి నిద్రపోవడానికి చోటిమ్మని అడిగినప్పుడు నీవు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపో అని ఆ పాస్టర్ గారు అనగా ఆ గ్రామంలోని స్కూల్ వరండాలో పడుకొని తిండి లేక ఆకలికి బాధపడుతూ ఉదయం లేచి మరలా తాను వాక్యాలు రాయడానికి యధావిధిగా వెళ్లారు. ఇలా సైకిల్ మీదే తిరిగేవారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో వాక్యాలు వ్రాయడానికి తిరుగుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ జిల్లాలలో పూర్తయిన తర్వాత ఆయన ప్రకాశం జిల్లాలో దేవుని వాక్యాలు వ్రాయటం మొదలుపెట్టారు. వాక్యము రాయటం మొదలు పెట్టేటప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే తను ఎంతో ఆకలితో అలమటిస్తున్నాడు. తను చేసిన ప్రార్థన ఏమిటంటే ప్రభువా నేను ఆకలికి అలమటించిపోతున్నాను దయచేసి నాకు కావలసిన ఆహారము నాకు పంపించు అని ప్రార్థన చేసి గోడ మీద వాక్యం రాస్తూ ఉండగా ఒక సహోదరి అతని దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి, అతని పరామర్శించి, తాను చేసే పనిని బట్టి సంతోషించి, తన ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనము పెట్టి పంపించింది.

ఆ విధంగా ఆయన ప్రతిరోజు వాక్యాలు రాయటం మొదలుపెట్టే ముందు తనకు కావలసిన ఆహారం కోసం, అదే విధంగా రంగులు కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి మొదలు పెట్టిన ప్రతిసారి అతనికి కావలసిన ఆహారమును, అలాగే రంగులకు కావలసిన డబ్బులు దేవుడు ఎవరో ఒకరి ద్వారా పంపించేవాడు. అలా అతనికి కావలసిన ఆహారము, టిఫిను, బసచేయడానికి స్థలము, రంగు డబ్బాలు దేవుడే ఎవరో ఒకరి ద్వారా సిద్ధపరిచేవాడు. ఈ విధంగా తన పరిచర్యకు దేవుడే సహాయం చేశాడు. “ఆ తర్వాత ఆయన కడప వెళ్లారు.* “కడపలో పలు పట్టణాలు తిరిగి వాక్యములు రాస్తున్నప్పుడు ఒక సహోదరుడు చూసి సంతోషించి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను పరామర్శించి తాను చేస్తున్న గవర్నమెంటు ఉద్యోగంలో నెలలో సంపాదించే జీతంలో కొంత భాగము పరిచర్యకు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వమని ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆ డబ్బును శాంతారావు గారికి ఇచ్చారు.* ఆ డబ్బు ద్వారా అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని వాక్యాలను వ్రాసారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో దేవుడు ఎన్నో రకాలుగా ఆయనకు సేవలు సహాయం అందించారు. బట్టలు లేని సమయంలో ఆయనకి దేవుడే నూతన వస్త్రాలను సిద్ధపరచేవాడు. ఆ విధంగా దేవుని సహాయముతో ఆంధ్రప్రదేశ్ అంత సైకిల్ మీద తిరిగి దేవుని వాక్యాలు వ్రాయడము పూర్తిచేశారు. ఆంధ్ర రాష్ట్రం పూర్తయిన తర్వాత మహారాష్ట్ర వెళ్లి దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నారు. కానీ ఎన్నో వ్యతిరేకతలు ఆయనకు ఎదురయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహారాష్ట్ర నలుమూలలా సంచరిస్తూ దేవుని వాక్యములు వ్రాసారు. అయితే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఇతనికి ఏర్పడిన వ్యతిరేకత ఏమిటంటే ఎవరైతే గోడల మీద రాసిన వాక్యాలను వ్రాసారో వారు వచ్చి చెరిపివేయాలి లేకపోతే ఆతనిని జైలులో వేస్తాము అనే న్యూస్ ప్రకటనను బట్టి అతను ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టి మధ్యప్రదేశ్, భూపాల్ రాష్ట్రాలు వెళ్ళారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్య పట్టణాలు తిరిగి దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నారు. అలా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా, దద్రహవేలి, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, పంజాబ్, జమ్మూ – కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రలన్ని పూర్తి చేయటానికి దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేశాడు.

ప్రతి రాష్ట్రంలోనికి వెళ్లినప్పుడు వారి భాషలో వాక్యమును పేపరుపై వ్రాయమని, దానిని నెమ్మదిగా చదవమని, దానికి పైన తెలుగులో అక్షరాలు రాసుకుని దానికి లిపిని అలవాటు చేసుకుని వాక్యాలు రాయడం మొదలుపెట్టేవాడు. అలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా మిగిలిన భాషల్లో వాక్యాలు రాశాడు, కుళాయిల పైన, బ్రిడ్జిల పైన, కరెంటు స్తంభాల పైన, గవర్నమెంట్ బిల్డింగులపైన వాక్యాలు రాయటం మొదలు పెట్టి చివరికి ఇండియా మొత్తం పూర్తి చేశారు. గవర్నమెంట్ బిల్డింగులపై దేవుని వాక్యాలు రాయటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మత ప్రచారం చేస్తున్నాడని తనపై కేసులు పెట్టారు. ఇలా వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయని తాను ఒక షర్టు కుట్టించుకున్నాడు. షర్ట్ కి ముందు, వెనుక దేవుని వాక్యములు వ్రాసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అదే షర్ట్ ధరించి వెళ్ళేవాడు. అలాగే హర్యానాలో వాక్యాలు రాస్తున్నప్పుడు కొంతమంది యువకులు సైకిళ్లతో అతనిని త్రొక్కించారు. ఎంతో అనారోగ్యానికి గురయ్యాడు కానీ ప్రభువు ఆయనకు ఎంతో సహాయం చేసి బలపరిచాడు. ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో శ్రమలు ఎదుర్కొని దేవుని కొరకు నిలబడ్డాడు. వాక్యాలు రాసుకుంటూ దేశమంతా తిరిగాడు. బీహార్ రాష్ట్రాములో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మద్రాసు పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ దేవుని వాక్యాలు రాయడం మొదలుపెట్టి మద్రాస్ పట్టణమంతా తిరుగుతున్నప్పుడు ఇతనికి ఆహారం ఉండేది కాదు. ఆహారము లేక అతని ఆరోగ్యం కూడా పాడయింది. అయితే అతను రాసిన వాక్యాలు చూసి తమిళభాష వారు మాట్లాడుకోవడం ఒక తెలుగు క్రైస్తవ నర్సు ఆలకించి ఆయనను చూడటానికి వెళ్లి అతనిని పరామర్శించింది. అలాగే అతను అనారోగ్యంతో ఉండటం గుర్తించి అతనికి వైద్యం, మందులు అందించింది. రెండు రోజులకు ఒకసారి ఆహారం పంపించేది. అదే ఆహారము ఆయన తినేవాడు. వేరే ఆహారం ఏమి ఆయనకు ఉండేది కాదు. అతని దగ్గర డబ్బులు కూడా లేని సమయాలలో అతని ప్రయాణాలకు, అతని ఖర్చులకు, అతని తిండికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా డబ్బులు పంపించేవారు. ఆ విధంగా ప్రభువులో ఎన్నో శ్రమలు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభువు అతనికి సహాయం చేశాడు. కొన్నిసార్లు భోజనం లేని సమయాల్లో రెండు బంగాళదుంపలు కొనుక్కొని వాటిని ఉడకబెట్టుకొని తినేవాడు. అయినప్పటికీ మద్రాసు పట్టణం అంతా తిరిగి దేవుని వాక్యమును గోడలమీద వ్రాయడం మానలేదు. ఆ విధంగా ప్రభువు సేవలో ఎంతో ప్రయాసపడి వాక్యములు రాస్తూ ఇండియా దేశం మొత్తం తిరిగారు. తాను చనిపోయే ముందు వరకు కూడా దేవుని వాక్యాలు గోడలపై వ్రాసే పనిలోనే ముందుకు కొనసాగారు. అలా ఆయన ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు…

480 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account