ఆహా యేమానందం ఆహా యేమానందము

Siyonu Geethamulu
184 Views

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2)          ||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2)          ||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2)       ||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2)        ||ఆహా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account