దేవా నా దేవుడవు నీవే

Hosanna Ministries
305 Views

దేవా………….. నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును – ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా………….. నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును

నీరు లేని దేశమందు – దప్పిగొన్నది నా ప్రాణం -2
నీ మీద ఆశచేత – సొమ్మసిల్లెను నా శరీరం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును

ఉత్సహించు పెదవులతో – నా నోరు చేసేను గానం -2
నీ రెక్కల చాటునా – శరణన్నది నా ప్రాణం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును – ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account