మహిమ స్వరూపుడా

Hosanna Ministries
1011 Views

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!

విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!

పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account