Chorantians Bible Quiz
View Allసాగిలపడి మ్రొక్కెదము
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి||
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులన్ ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగా తానే యుండెన్ (2)
ఆలయము మీరే అనెను
ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి||