నిక్కమురా లోకము చెడ్డదిరా

Raj Prakash Paul
263 Views

నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో సోదారా
ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా

విన్నాననుకొంటివి – కాని గ్రహియింపకున్నావా ?
చూసాననుకొంటూనే – తెరువలేకున్నావా
దగ్గరగా ఉంటూనే – దూరాన నిలిచేవా
త్రోవను జారా విడిచి – కుడి ఎడమకు తప్పావా
పాపేచ్చలతోటి – క్రీస్తేసుని మరిచావా
తన గాయములను రేపుటకు – కారకుడైయున్నావా|| నిక్కమురా ||

శోధనల పోరుటముతో – సరిపెట్టకు నీ పయనం
కష్టానష్టాలను సాకులు – తప్పించవు నీ గమ్మం
పానార్పణనొందే గాని – సుఖమెరుగకు అది శూన్యం
ప్రేమ విశ్వాసముతోటి – నడిచేదే నీ జీవితం
నీ పరుగును కడముట్టించే – నీదే మంచి పోరాటం
పరభాగ్యము నీవు పొంద – ప్రకటించుము యేసుని వాక్యం|| నిక్కమురా ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account