గాయపడిన నీ చేయి చాపుము దేవా

197 Views

గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది      ||గాయపడిన||

ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి (2)
సురూపమైనా ఏ సొగసైనా (2)
లేనివానిగా నాకై మారితివి      ||గాయపడిన||

మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి (2)
మా రోగములు మా వ్యసనములు (2)
నిశ్చయముగా నీవు భరియించితివి      ||గాయపడిన||

నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది (2)
నీవు కార్చిన రక్తమే (2)
మా అందరికీ ఇల ప్రాణాధారము      ||గాయపడిన||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account