గాయాములన్ గాయములన్

194 Views

గాయాములన్ గాయములన్
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

సురూపమైన సొగసైనా లేదు
దుఃఖ భరితుడాయెను (2)
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)       ||గాయాములన్||

మా అతిక్రమ క్రియలను బట్టి
మరి నలుగ గొట్టబడెను (2)
తాను పొందిన దెబ్బల ద్వారా
స్వస్థత కలిగె మనకు (2)       ||గాయాములన్||

క్రీస్తు ప్రేమను మరువజాలము
ఎంతో ప్రేమించే మనల (2)
సిలువపై మేము గమనించ మాకు
విలువైన విడుదల కలిగె (2)       ||గాయాములన్||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account