ఘనమగు వేడుకకు

156 Views

కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..

కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా (2)
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై       ||కూడుకొని||

వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన       ||కూడుకొని||

పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన       ||కూడుకొని||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account