చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా 

140 Views

చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా (2)
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ          ||చూచితివే||

ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2)
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account