చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు

143 Views

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)
నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)
నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2)          ||చూచుచున్న||

శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను (2)
ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును        ||చూచుచున్న||

ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని (2)
కన్నకొడుకు మరణము చూడలేక (2)
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను       ||చూచుచున్న||

పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు (2)
నీ సంతతిని దీవింతునని (2)
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు          ||చూచుచున్న||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account