సిలువలో సాగింది యాత్ర

266 Views

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే             ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account