నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే

156 Views

నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account