త్రిత్వైకమా సకలేశ్వరా

151 Views

త్రిత్వైకమా సకలేశ్వరా
పూజ్యుడౌ శ్రేయస్కరా (2)
ధ్యానించెద హృది వాంఛతో
గళమెత్తెద మృదు భాషతో
నా సుతుడా సర్వే సుతుడా
నా జనకా సర్వే జనకా          ||త్రిత్వైకమా||

దోష భావముకు బంధునవ్వగా
దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2)
వాక్యపు వెలుగై నాకిల వెలుగై
ముక్తినిచ్చిన నీకు వందనం (2)         ||త్రిత్వైకమా||

క్షితియందు ఎరకు మోసిపోతిని
క్షమలేక ఇలలో మృతమైతిని (2)
వెల దాతవై జీవ దాతవై
స్థితి మార్చిన నీకు వందనం (2)          ||త్రిత్వైకమా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account