సువార్తను ప్రకటింపవా

141 Views

సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ (2)        ||సువార్తను||

సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account