దేవా నీ సాక్షిగా నేనుండుట

192 Views

దేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు      ||దేవా||

నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట      ||దేవా||

నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద      ||దేవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account