రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

168 Views

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ||

యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య||

ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2)       ||రావయ్య||

దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2)       ||రావయ్య||

శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)       ||రావయ్య||

నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)       ||రావయ్య||

అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)       ||రావయ్య||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account