Chorantians Bible Quiz
View Allరావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య||
మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య||
పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య||
అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య||