Chorantians Bible Quiz
View Allలేచినాడురా సమాధి గెలచినాడురా
లేచినాడురా
సమాధి గెలచినాడురా (2) యేసు
లేతునని తా చెప్పినట్లు (2)
లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా||
భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2)
నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా||
పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2)
పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||
యేసునందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా||
పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా||