వివాహమన్నది పవిత్రమైనది

241 Views

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account