స్తుతించెదను స్తుతించెదను

140 Views

స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము        ||స్తుతించెదను||

ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2)
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2)
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)         ||స్తుతించెదను||

నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2)
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2)
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2)         ||స్తుతించెదను||

పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2)
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2)
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2)         ||స్తుతించెదను||

తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2)
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2)
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2)         ||స్తుతించెదను||

సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2)
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2)
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2)         ||స్తుతించెదను||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account