స్తోత్రము స్తుతి చెల్లింతుము

179 Views

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం (2)           ||స్తోత్రము||

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా (2)
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా (2)       ||నీవే||

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి (2)       ||నీవే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account