కాపాడే దేవుడు యేసయ్యా కరుణించే రక్షకుడేసయ్యా

249 Views

కాపాడే దేవుడు యేసయ్యా
కరుణించే రక్షకుడేసయ్యా
మనసు మార్చు దేవుడు యేసయ్యా
నిత్య జీవ మార్గం యేసయ్యా (2)
ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా
ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా        ||కాపాడే||

మనుష్యులను నమ్మొద్దనెను
మంచి మాటలు పలికెదరనెను (2)
మోసం చేసే మనుష్యులకంటే
మంచి దేవుడు యేసే మిన్నన్నా
మోక్షమిచ్చుఁ యేసే గొప్పని
తెలుసుకుంటే మంచిది ఓరన్నా       ||ఓరన్నో||

నిన్ను విడువనన్నాడు
ఎడబాయను అన్నాడు (2)
దిగులు చెంది కలత చెందకు
నీ అభయం నేనే అన్నాడు (2)       ||ఓరన్నో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account