కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా

205 Views

కీర్తింతును నీ నామము
మనసారా యేసయ్యా (2)
మదిలో ధ్యానించి (2)
తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా     ||కీర్తింతును||

ఏలేశమైన కరుణకు
ఈ దోషి పాత్రమా (2)
కల్వరిలో కృప చూపి
కలుషాలు బాపిన.. నా యేసయ్యా     ||కీర్తింతును||

వేనోళ్ళతోను పొగిడినా
నీ ఋణము తీరునా (2)
ఇన్నాళ్లు కన్నీళ్లు (2)
తుడిచావు జాలితో.. నా యేసయ్యా     ||కీర్తింతును||

జీవింతు నేను నీ కొరకే
నీ సాక్షిగా ఇలలో (2)
సేవించి పూజింతు (2)
నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా      ||కీర్తింతును||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account