Chorantians Bible Quiz
View Allకృపామయుడా – నీలోనా
కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా||
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా||
నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా||
ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||