క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా

124 Views

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన సుఖమురా ఇది (2)
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా
ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా         ||క్షణికమైన||

ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)
ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2)          ||ఓ స్నేహితుడా||

గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)
ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2)          ||ఓ స్నేహితుడా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account