నన్ను నీవలె నిర్మించినను

137 Views

నన్ను నీవలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||

ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని (2)
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||

భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||

సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని (2)
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account