Chorantians Bible Quiz
View Allనలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ||
పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ||
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ||