Chorantians Bible Quiz
View Allదయగల హృదయుడవు
Hosanna Ministriesదయగల హృదయుడవు నీ స్వాస్థ $మును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును
సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము
శ్రేష్టమైన ఉపదేశముతో – జీవము గలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను – నడుపుచున్నావు సమృద్ధితో
పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము
విస్వాసమందు నిలకడగా – నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును – నిను నిశ్చలమైన నిరీక్షణతో
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము
ఆశ్రయమైనది నీ నామమే – సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా – నిత్యము కీర్తించి ఘనపరతును