నా కృప నీకు చాలని

145 Views

నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ (2)       ||నా కృప||

నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2)      ||నాతో||

పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2)      ||నాతో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account