నా ప్రాణమా ఏలనే క్రుంగినావు

138 Views

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)
నెమరేసుకుంటూ ప్రాణమా
స్తుతిపాడుమా – స్తుతిపాడుమా        ||నా ప్రాణమా||

నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)
నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
నీవు కూడా తన కార్యం పాటించుమా (2)
అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా
మరువకు సుమా – మరువకు సుమా        ||నా ప్రాణమా||

నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు
నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2)
నా ప్రాణమా నాలో కరిగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని దయ కోరుమా
దయ కోరుమా – దయ కోరుమా        ||నా ప్రాణమా||

నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు
నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2)
నా ప్రాణమా నాలో కృంగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని కృప కోరుమా
కృప కోరుమా – కృప కోరుమా         ||నా ప్రాణమా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account