జయ రాజాధిరాజా విజయ తేజ

Palepogu Lazarbabu
244 Views

జయ రాజాధిరాజా విజయ తేజ స్తోత్రించెదను
నీ రాజ్యపారునిగా మార్చటకు
చెర నుండి విడిపించి ముందుండి నడిపించే సర్వలోక చక్రవర్తి వయ్యా

1. పాపానికి దాసుడను – నేను నీతికి రూపమే నీవు
అణువంతైనా అర్దత లేదు స్వతంత్రునిగా మారుటకు
మరణముకన్నా లోతైన ప్రేమతో నను భరించావయ్య
నీ ప్రాణమునే క్రయముగా చెల్లించి నన్ను విడిపించావయ్యా
నీ త్యాగం – నా భాగ్యం నా ధర్మం – నీ ఆనందం
సర్వలోకపాప విమోచకుదా

2. రాజ్యాలెన్హైన దేశాలెన్నైన – నాయకులెవరైనా
క్షణమైనా సరిపోల్టలేను సుగుణగణముల పరిపాలక
సుపరిపాలన ఇలలో ఎవరికి సాధ్యము కాదయా
స్వార్ధరహితుడా ఎల్లరకు కృప చూపుచున్నావయా
నీ రాజ్యం – నా గమ్యం వేగిరమే – దిగిరావా
కోటిసూర్య తేజోమయా

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account