నాకున్నది నీవేనని

153 Views

నాకున్నది నీవేనని
నను కన్నది సిలువేనని (2)
నీవున్నది నాలోనని
నేనున్నది నీకేనని
సాక్ష్యమిచ్చెద యేసయ్యా
నీ సాక్షిగా బ్రతికించుమయ్యా       ||నాకున్నది||

గుడ్డివాడను నేనేనని
నీ చూపు ప్రసాదించేవని (2)
చెవిటి వాడను నేనేనని
నీ వినికిడి నేర్పించేవని         ||సాక్ష్యమిచ్చెద||

మూగవాడను నేనేనని
నీ మాటలు పలికించేవని (2)
అవిటివాడను నేనేనని
నీ నడకలు నేర్పించేవని         ||సాక్ష్యమిచ్చెద||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account