నాదు జీవితము మారిపొయినది

190 Views

నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా          ||నాదు||

చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..        ||నాదు||

జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2)
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..         ||నాదు||

ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2)
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..         ||నాదు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account