This is a test payment link
Category: Uncategorized
DAY 6 – 29 DAYS BIBLE QUIZ
DAY 5 – 29 DAYS BIBLE QUIZ
Registration bible
[everest_form id=”22498″]
క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటి?
క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా అర్థం ఏమిటి? బైబిల్ లో ఈ ప్రశ్నకు జవాబిచ్చు ఉత్తమమైన వాక్యము యోహాను 3:1-21. ప్రముఖ పరిసయ్యుడును యూదుల సన్హెద్రెనులో (యూదుల అధికారుల సభ) సభ్యుడునునైన నీకొదేముతో ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుచుండెను. నీకొదేము కొన్ని ప్రశ్నలతో రాత్రి వేళ యేసు యొద్దకు వచ్చెను.
యేసు నీకొదేముతో మాట్లాడుతూ, ఇలా అనెను, “‘ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’ అందుకు నీకొదేము, ‘ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?’ అని అడిగెను. ‘రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగెను!’ అందుకు యేసు ఇట్లనెను, ‘ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు’” (యోహాను 3:3-7).
“క్రొత్తగా జన్మించుట” అను మాట యొక్క అక్షరార్థము “పైనుండి జన్మించుట.” నీకొదేముకు ఒక నిజమైన అవసరత ఉండెను. అతనికి హృదయ పరివర్తన-ఆత్మీయ మార్పు అవసరము. క్రొత్త జీవితం, తిరిగి జన్మించుట, అనునది దేవుని కార్యము మరియు విశ్వసించు వ్యక్తికి నిత్య జీవము ఇవ్వబడుతుంది (2 కొరింథీ. 5:17; తీతు. 3:5; 1 పేతురు 1:3; 1 యోహాను 2:29; 3:9; 4:7; 5:1-4, 18). “క్రొత్తగా జన్మించుట” అనగా యేసు క్రీస్తు నామమును నమ్ముట ద్వారా “దేవుని పిల్లలగుట” అను తలంపు కూడ వస్తుందని యోహాను 1:12, 13 సూచిస్తుంది.
“ఒక వ్యక్తి నూతనంగా ఎందుకు జన్మించాలి?” అనునది సాధారణంగా తలెత్తు ప్రశ్న. “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను” అని ఎఫెసీ. 2:1లో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా. 3:23) అని ఆయన రోమీయులకు వ్రాసెను. పాపులు ఆత్మీయంగా “మరణించియున్నారు”; క్రీస్తు నందు విశ్వాసము ద్వారా వారు ఆత్మీయ జీవితమును పొందినప్పుడు, దానిని బైబిల్ నూతన జన్మతో పోలుస్తుంది. కేవలం నూతనంగా జన్మించినవారు మాత్రమే పాప క్షమాపణ పొంది దేవునితో అనుబంధం కలిగియుందురు.
ఇది ఎలా సాధ్యము? “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” అని ఎఫెసీ. 2:8-9 చెబుతుంది. ఒకరు రక్షింపబడినప్పుడు, అతడు/ఆమె క్రొత్తగా జన్మించి, ఆత్మీయంగా నూతనపరచబడి, క్రొత్త జన్మ హక్కు ద్వారా దేవుని బిడ్డ అవుతారు. సిలువపై మరణించుట ద్వారా పాపము యొక్క జీతమును చెల్లించిన యేసు క్రీస్తును నమ్ముట, “నూతనంగా జన్మించుటకు” మార్గము. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను!” (2 కొరింథీ. 5:17).
మీరు ఇప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా విశ్వసించని యెడల, పరిశుద్ధాత్ముడు మీ హృదయములతో మాట్లాడుచుండగా ఆయన పిలుపును మీరు అంగీకరిస్తారా? మీరు పశ్చాత్తాప ప్రార్థన చేసి నేడు క్రీస్తులో నూతన సృష్టి కాగలరా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలనైనను శరీరేచ్చవలనైనను మానుషేచ్చవలననైనను పుట్టినవారు కారు” (యోహాను 1:12-13).
మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రొత్తగా జన్మించాలని కోరితే, ఇలా ప్రార్థన చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”
క్షమాపణ పొందితివా? దేవుని నుండి నేను క్షమాపణ ఎలా పొందగలను?
“కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది,” అని అపొ. 13:38 ప్రకటిస్తుంది.
క్షమాపణ అంటే ఏమిటి మరియు అది నాకు ఎందుకు కావలెను?
“క్షమాపణ” అనగా పలకను శుభ్రంగా తుడుచుట, క్షమించుట, అప్పును రద్దుచేయుట. మనం ఎవరికైనా తప్పు చేసిన యెడల, ఆ అనుబంధమును పునరుద్ధరించుటకు వారి క్షమాపణ కోరతాము. క్షమాపణ అనునది ఎదుటి వ్యక్తి క్షమాపణకు యోగ్యుడు కాబట్టి ఇవ్వబడదు. క్షమాపణకు ఎవ్వరు యోగ్యులు కారు. క్షమాపణ అనునది ప్రేమ, కరుణ, మరియు కృపతో కూడిన కార్యము. క్షమాపణ అనగా ఎదుటి వ్యక్తి మీకు ఏమి చేసినను, ఆ వ్యక్తికి విరోధముగా మనస్సులో ఏమి ఉంచుకొనకూడదని మీరు తీసుకొనే నిర్ణయం.
మనమంతా దేవుని నుండి క్షమాపణ పొందవలసియున్నామని బైబిల్ చెబుతుంది. మనమంతా పాపము చేసితిమి. “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని ప్రసంగి 7:20 ప్రకటిస్తుంది. “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు” అని 1 యోహాను 1:8 చెబుతుంది. పాపమంతా తుదకు దేవునికి విరోధముగా తిరుగుబాటు అవుతుంది (కీర్తనలు 51:4). అందువలన, మనకు దేవుని క్షమాపణ ఖచ్చితముగా అవసరము. మన పాపములు క్షమించబడనియెడల, మన పాపముల యొక్క పరిణామాలను చెల్లిస్తూ శ్రమపొందుతు నిత్యత్వమును గడుపుతాము (మత్తయి. 25:46; యోహాను 3:36).
క్షమాపణ-నేను ఎలా పొందగలను?
దేవుడు ప్రేమ మరియు కరుణ గలవాడు – ఆయన మన పాపములను క్షమించాలని ఆశించుచున్నాడు! “…యెవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు” అని 2 పేతురు 3:9 చెబుతుంది. దేవుడు మనలను క్షమించాలని ఆశించెను కాబట్టి, మన క్షమాపణకు వెల చెల్లించెను.
మన పాపములకు ఏకైక న్యాయమైన పరిహారం మరణం. “పాపమువలన వచ్చు జీతము మరణము” అని రోమా. 6:23 యొక్క మొదటి భాగము తెలియజేయుచున్నది. మన పాపముల వలన మనం పొందినది నిత్య మరణము. దేవుడు, తన పూర్ణ ప్రణాళికలో, మానవుడాయెను – యేసు క్రీస్తు (యోహాను 1:1, 14). మనం పొందవలసిన మరణం అను జీతమును తనపై వేసుకొని యేసు సిలువపై మరణించెను. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను” అని 2 కొరింథీ. 5:21 మనకు బోధిస్తుంది. మన శిక్షను తనపై వేసుకొని యేసు సిలువపై మరణించెను! దేవునిగా, యేసు యొక్క మరణము సర్వమానవాళి పాపములకు క్షమాపణను అందించెను. “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు” అని 1 యోహాను 2:2 ప్రకటిస్తుంది. పాపము మరియు మరణముపై తన విజయమును ప్రకటిస్తూ యేసు మరణము నుండి తిరిగిలేచెను (1 కొరింథీ. 15:1-28). దేవునికి మహిమ, యేసు క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్ధానము ద్వారా, రోమా. 6:23 యొక్క రెండవ భాగము సత్యము, “…అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.”
మీ పాపములు క్షమించబడాలని మీరు కోరుచున్నారా? మీలో మీ నుండి దూరము కాని పాప భారమను భావన ఉందా? మీ రక్షకునిగా యేసు క్రీస్తును మీరు నమ్మినయెడల, మీకు పాప క్షమాపణ లభిస్తుంది. “దేవుని కృపామహాదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది” అని ఎఫెసీ. 1:7 చెబుతుంది. మనం క్షమించబడుటకు, యేసు మన ఋణమును చెల్లించెను. మీరు చెయ్యవలసిందంతా, యేసు ద్వారా మిమ్మును క్షమించమని దేవుని అడిగినయెడల- మీ క్షమాపణకు వెల చెల్లించుటకు యేసు మరణించెను అని నమ్మి-ఆయన మిమ్మును క్షమించును! యోహాను 3:16-17లో ఈ గొప్ప సందేశము ఉన్నది, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.”
క్షమాపణ-ఇది అంత సులభమా?
అవును ఇది సులభమే! మీరు దేవుని నుండి క్షమాపణ సంపాదించలేరు. దేవుడు మీకిచ్చు క్షమాపణకు మీరు వెల చెల్లించలేరు. మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి దేవుని నుండి క్షమాపణ పొందగోరినయెడల, ఈ ప్రార్థన చెయ్యవచ్చు. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”
మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.
Grand Christmas Bible Quiz – 2
Praise the Lord,
Grand Christmas Bible Quiz – 2
*Rules*
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
3.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, తరువాత Login with OTP ని ఉపయోగించి Login అవ్వవచ్చు.
4. క్విజ్ సమయం 15 నిమిషములు మాత్రమే…30 ప్రశ్నలు వ్రాయాలి.
5. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి.
6. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు.
7. ఖచ్చితంగా 7 గంటలకు మీకు క్విజ్ లింకు ఓపెన్ అవుతుంది.
8. మీరు ఒక్కసారి మాత్రమే Submit చేయాలి, ఎక్కువ సార్లు చేస్తే Dis qualify అవుతారు.
(లేదా)
మీరు TCT Next App ని Open చేయగానే క్విజ్ పోస్టర్ ని Click చేసినా కూడా క్విజ్ రాయవచ్చు.
క్విజ్ రాయడానికి Click here ని నొక్కండి
Thank You for all
Ultimate Bib Quiz – 1 Rules
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 15 నిమిషములు మాత్రమే…30 ప్రశ్నలు వ్రాయాలి.
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి.
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు.
8. ఖచ్చితంగా 7 గంటలకు మీకు క్విజ్ లింకు ఓపెన్ అవుతుంది
HOW MANY BOOKS – CHAPTERS – VERSES – WORDS IN BIBLE
# | Book | Chapters | Verses | Words | Author | Genre | OT/NT |
---|---|---|---|---|---|---|---|
1 | Genesis | 50 | 1533 | 38262 | Moses | Law | OT |
2 | Exodus | 40 | 1213 | 32685 | Moses | Law | OT |
3 | Leviticus | 27 | 859 | 24541 | Moses | Law | OT |
4 | Numbers | 36 | 1289 | 32896 | Moses | Law | OT |
5 | Deuteronomy | 34 | 959 | 28352 | Moses | Law | OT |
6 | Joshua | 24 | 658 | 18854 | Unknown | History | OT |
7 | Judges | 21 | 618 | 18966 | Unknown | History | OT |
8 | Ruth | 4 | 85 | 2574 | Unknown | History | OT |
9 | 1 Samuel | 31 | 810 | 25048 | Unknown | History | OT |
10 | 2 Samuel | 24 | 695 | 20600 | Unknown | History | OT |
11 | 1 Kings | 22 | 816 | 24513 | Unknown | History | OT |
12 | 2 Kings | 25 | 719 | 23517 | Unknown | History | OT |
13 | 1 Chronicles | 29 | 942 | 20365 | Ezra | History | OT |
14 | 2 Chronicles | 36 | 822 | 26069 | Ezra | History | OT |
15 | Ezra | 10 | 280 | 7440 | Ezra | History | OT |
16 | Nehemiah | 13 | 406 | 10480 | Nehemiah | History | OT |
17 | Esther | 10 | 167 | 5633 | Unknown | History | OT |
18 | Job | 42 | 1070 | 18098 | Unknown | Poetry | OT |
19 | Psalms | 150 | 2461 | 42704 | Various | Poetry | OT |
20 | Proverbs | 31 | 915 | 15038 | Solomon | Poetry | OT |
21 | Ecclesiastes | 12 | 222 | 5579 | Solomon | Poetry | OT |
22 | Song of Solomon | 8 | 117 | 2658 | Solomon | Poetry | OT |
23 | Isaiah | 66 | 1292 | 37036 | Isaiah | Prophecy | OT |
24 | Jeremiah | 52 | 1364 | 42654 | Jeremiah | Prophecy | OT |
25 | Lamentations | 5 | 154 | 3411 | Jeremiah | Poetry | OT |
26 | Ezekiel | 48 | 1273 | 39401 | Ezekiel | Prophecy | OT |
27 | Daniel | 12 | 357 | 11602 | Daniel | Prophecy | OT |
28 | Hosea | 14 | 197 | 5174 | Hosea | Prophecy | OT |
29 | Joel | 3 | 73 | 2033 | Joel | Prophecy | OT |
30 | Amos | 9 | 146 | 4216 | Amos | Prophecy | OT |
31 | Obadiah | 1 | 21 | 669 | Obadiah | Prophecy | OT |
32 | Jonah | 4 | 48 | 1320 | Jonah | Prophecy | OT |
33 | Micah | 7 | 105 | 3152 | Micah | Prophecy | OT |
34 | Nahum | 3 | 47 | 1284 | Nahum | Prophecy | OT |
35 | Habakkuk | 3 | 56 | 1475 | Habakkuk | Prophecy | OT |
36 | Zephaniah | 3 | 53 | 1616 | Zephaniah | Prophecy | OT |
37 | Haggai | 2 | 38 | 1130 | Haggai | Prophecy | OT |
38 | Zechariah | 14 | 211 | 6443 | Zechariah | Prophecy | OT |
39 | Malachi | 4 | 55 | 1781 | Malachi | Prophecy | OT |
40 | Matthew | 28 | 1071 | 23343 | Matthew | Gospel | NT |
41 | Mark | 16 | 678 | 14949 | Mark | Gospel | NT |
42 | Luke | 24 | 1151 | 25640 | Luke | Gospel | NT |
43 | John | 21 | 879 | 18658 | John | Gospel | NT |
44 | Acts | 28 | 1007 | 24229 | Luke | History | NT |
45 | Romans | 16 | 433 | 9422 | Paul | Letter | NT |
46 | 1 Corinthians | 16 | 437 | 9462 | Paul | Letter | NT |
47 | 2 Corinthians | 13 | 257 | 6046 | Paul | Letter | NT |
48 | Galatians | 6 | 149 | 3084 | Paul | Letter | NT |
49 | Ephesians | 6 | 155 | 3022 | Paul | Letter | NT |
50 | Philippians | 4 | 104 | 2183 | Paul | Letter | NT |
51 | Colossians | 4 | 95 | 1979 | Paul | Letter | NT |
52 | 1 Thessalonians | 5 | 89 | 1837 | Paul | Letter | NT |
53 | 2 Thessalonians | 3 | 47 | 1022 | Paul | Letter | NT |
54 | 1 Timothy | 6 | 113 | 2244 | Paul | Letter | NT |
55 | 2 Timothy | 4 | 83 | 1666 | Paul | Letter | NT |
56 | Titus | 3 | 46 | 896 | Paul | Letter | NT |
57 | Philemon | 1 | 25 | 430 | Paul | Letter | NT |
58 | Hebrews | 13 | 303 | 6897 | Unknown | Letter | NT |
59 | James | 5 | 108 | 2304 | James | Letter | NT |
60 | 1 Peter | 5 | 105 | 2476 | Peter | Letter | NT |
61 | 2 Peter | 3 | 61 | 1553 | Peter | Letter | NT |
62 | 1 John | 5 | 105 | 2517 | John | Letter | NT |
63 | 2 John | 1 | 13 | 298 | John | Letter | NT |
64 | 3 John | 1 | 14 | 294 | John | Letter | NT |
65 | Jude | 1 | 25 | 608 | Jude | Letter | NT |
66 | Revelation | 22 | 404 | 11952 | John | Prophecy | NT |
Volunteer for TCT Next
Martin Luther
[dflip id=”4361″ ][/dflip]
Game 1
Prashanth
RULES & REGULATIONS
- ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
- క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
- క్విజ్ సమయం 8 నిమిషములు మాత్రమే
- కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
- మీ పేరు , మీ ఫోన్ నెంబర్ తప్పుగా వ్రాయకూడదు
- దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
- మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
- బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందకి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
ఇప్పుడే బైబిల్ క్విజ్ వ్రాయడానికి ఈ క్రింద వున్న ఫోటో ను క్లిక్ చేయండి.
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!