క్రైస్తవుడు అంటే ఎవరు?

“క్రైస్తవుని యొక్క నిఘంటువు నిర్వచనం ఈ విధంగా ఉండవచ్చు, “యేసు క్రీస్తని లేక క్రీస్తు బోధలపై ఆధారపడి ఉన్న మతముపై నమ్మికను ఒప్పుకొను వ్యక్తి.” ఇది మంచి ఆరంభ బిందువు అయినప్పటికీ, అనేక నిఘంటువు నిర్వచనాల వలె, క్రైస్తవునిగా ఉండుటకు బైబిల్ యొక్క నిజమైన సత్యమును చెప్పుటలో విఫలమవుతుంది. క్రొత్త నిబంధనలో “క్రైస్తవుడు” అనే పదం మూడు సార్లు ఉపయోగించబడెను (అపొ. 11:26; 26:28; 1 పేతురు 4:16). యేసు క్రీస్తు అనుచరులు “క్రైస్తవులని” మొదట అంతియోకయలో పిలువబడిరి (అపొ. 11:26), ఎందుకంటే వారి స్వభావం, కార్యకలాపాలు, మరియు మాటలు క్రీస్తు వలె ఉన్నాయి కాబట్టి. “క్రైస్తవుడు” అనే పదమునకు అక్షరార్థం, “క్రీస్తు గుంపుకు చెందినవాడు,” లేక “క్రీస్తు అనుచరుడు.”

దురదృష్టవశాత్తూ కాలక్రమంలో, “క్రైస్తవుడు” అనే పదం దాని ప్రాముఖ్యతను కోల్పోయి ఒక వ్యక్తి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు కానప్పటికీ మతపరమైన వ్యక్తి లేక గొప్ప నైతిక విలువలు కలవాడైతే వారికి ఈ పదం ఉపయోగించబడెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచని చాలా మంది, వారు సంఘమునకు వెళ్తారు కాబట్టి లేక “క్రైస్తవ” దేశమునకు చెందినవారు కాబట్టి తమను తాము క్రైస్తవులని ఊహించుకుంటారు. కాని సంఘమునకు వెళ్లుట, మీకంటే తక్కువ భాగ్యం కలవారికి సేవ చేయుట, లేక మంచి వ్యక్తిగా ఉండుట మిమ్మును క్రైస్తవుని చేయలేదు. ఒక గ్యారేజీకు వెళ్లుట మిమ్మును కారుగా ఎలా చేయదో కేవలం చర్చికి వెళ్లుట మిమ్మును క్రైస్తవుని చేయలేదు. సంఘములో సభ్యునిగా ఉంటూ, సంఘ కార్యక్రమాలలో తరచుగా పాలుపంచుకోవడం, మరియు సంఘ పనికి ఇచ్చుట మిమ్మును క్రైస్తవుని చేయలేదు.

మనం చేయు మంచి పనుల వలన దేవునికి అంగీకారయోగ్యం కాలేమని బైబిల్ మనకు బోధిస్తుంది. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను,” అని తీతు. 3:5 చెబుతుంది. కాబట్టి, క్రైస్తవుడు దేవుని ద్వారా తిరిగి జన్మించినవాడు (యోహాను 3:3; యోహాను 3:7; 1 పేతురు 1:23) మరియు యేసు క్రీస్తునందు విశ్వాసం మరియు భరోసా ఉంచినవాడు. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే” అని ఎఫెసీ. 2:8 మనకు చెబుతుంది.

యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు కార్యము మీద, మన పాపములకు వెల చెల్లించుటకు ఆయన సిలువ మరణం మరియు మూడవ దినమున ఆయన పునరుత్ధానం మీద విశ్వాసం మరియు భరోసా ఉంచువాడే నిజమైన క్రైస్తవుడు. “తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని యోహాను 1:12 చెబుతుంది. నిజమైన క్రైస్తవుని యొక్క గుర్తు ఇతరుల పట్ల ప్రేమ మరియు దేవుని వాక్యమునకు విధేయత (1 యోహాను 2:4, 10). నిజమైన క్రైస్తవుడు నిజముగా దేవుని బిడ్డ, దేవుని నిజమైన కుటుంబములో భాగం, మరియు యేసు క్రీస్తులో నూతన జీవితము ఇవ్వబడినవాడు.

303 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account