Chorantians Bible Quiz
View Allఆదియంతము లేనివాడా
Siyonu Geethamuluఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము||
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము||
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము||
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము||
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||