Chorantians Bible Quiz
View Allఆరాధించెదము ఆత్మతో నిరతము
ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము||
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)
అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము||
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే (2)
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)
పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము||
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)
యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ||ఆరాధించెదము||