ఆరాధన ఆరాధన యేసు ప్రభువునకే

Raj Prakash Paul
844 Views

ఆరాధన ఆరాధన యేసు ప్రభువునకే స్తుతి అర్పణ
ఆరాధన ఆరాధన క్రేస్తేసునకే హృది అర్పణ
ఆరాధింతును యేసు ఆరాధింతును నిన్నే } 3
ఆరాధింతును యేసు ఆరాధింతును

పరిశుద్ధ దైవమా ప్రక్షాళన చేయుమా
సర్వోన్నత దైవమా జీవాత్మతో నింపుమా } 2
రక్షణ భాగ్యమిచ్చిన గొర్రెపిల్లవైన క్రీస్తు
సింహాసనసీనుడా స్తుతియు ఘనత నీకే కలుగును|| ఆరాధన ||

తేజస్వరూప నీ మహిమతో నింపుమా
ప్రేమాస్వరూప నీ ప్రేమతో నింపుమా
పవిత్రుడా నీ క్రియలు గొప్పవి
యుగాలకు రాజువైతివి శక్తి బలము నీకే కలుగును|| ఆరాధన ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account