ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో

Hosanna Ministries
2058 Views

ఆరాధన స్తుతి ఆరాధన
ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
తండ్రియైన దేవా కుమారుడైన ప్రభువా పరిశుద్ద్ధాత్మదేవ
త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన

సర్వసృష్టికి అఆధారుడా సకలజీవుల పోషకుడా
సీయ్యోనులోనుండి దీవించువాడవు
సదాకాలము జీవించువాడవు
సాగిలపడినే నమస్కరించి
సర్వదా నిను కొనియాడెద నిన్నే కీర్తించెద ॥తండ్రియైన॥

సార్వాత్రిక సంఘాస్థాపకుడా సర్వలోక రక్షకుడా
సిలువలో నీరక్తమే నాకై కార్దితివి
శిధిలముకాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీకీర్తి తలచి
సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును ||తండ్రియైన||

సర్వసత్యమునకు ఆధారమై పరిశుద్ధయాజకుల సారాధివై
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచార్య నే చేయుటకై
నూతన కృపలను నేపొందెద ఆత్మశక్తితో సాగేద || తండ్రియైన॥

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account